ఫిబ్రవరి 14 ని ”కౌ హగ్ డే” గా జరుపుకోండి… జంతు సంక్షేమ శాఖ పిలుపు

ఈ సారి ఫిబ్రవరి 14 ని వాలెంటైన్స్ డే గా కాకుండా కౌ హగ్ డే గా జరుపుకోవాలని కేంద్ర పశుసంక్షేమ శాఖ పిలుపునిచ్చింది. ఆ రోజున గోవులను ఆలింగనం చేసుకోవాలని సూచించింది. దీంతో పాజిటివ్‌ ఎనర్జీ వ్యాప్తి చెందడమే కాక, ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతుందని పేర్కొంది. గోవులు భారత సంస్కృతి, గ్రామీణ ఆర్థికానికి వెన్నెముక అని, వాటిని గోమాత అని పిలుస్తారని వివరించింది.

 

వాలెంటైన్స్ డే…పాశ్చాత్య సంస్కృతికి చెందిందని.. దానికి బదులుగా ఆవుని కౌగిలించుకుని వాటితో మన బంధాన్ని బల పరుచుకోవాలంటూ పిలుపునిచ్చింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి ఆవులే వెన్నెముక లాంటివి. వాటితోనే మన మనుగడ కొనసాగుతోంది. జీవ వైవిధ్యానికి అవి ప్రతీకలు. అందుకే కామధేను, గోమాత అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. అమ్మలా మనకు అన్నీ సమకూర్చుతుంది. మానవత్వాన్నీ కాపాడుతుంది. గోమాతను పూజించే వాళ్లందరూ ఫిబ్రవరి 14వ తేదీన Cow Hug Day జరుపుకోండి. గోమాత ప్రాధాన్యతను గుర్తించండి” అని పిలుపునిచ్చింది.

 

 

Related Posts

Latest News Updates