శ్రీదేవి అభిమానులకు గుడ్ న్యూస్… పుస్తక రూపంలో రానున్న జీవిత చరిత్ర

అందాల నటి శ్రీదేవి. భారతీయ సినీ చరిత్రలో అదో పేజీ. ఎప్పటికీ చెరిగిపోని పేజీ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర హీరోల అందరి సరసన నటించారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300ల చిత్రాలు చేశారు. చాలా అవార్డులు కూడా లభించాయి. ఇప్పుడు ఆమెను బాగా అభిమానించే వారికి ఓ గుడ్ న్యూస్.

నటి శ్రీదేవి జీవిత చరిత్ర ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. the life of a legend పేరుతో ఈ పుస్తకం రానుంది. శ్రీదేవి కుటుంబంతో బాగా పరిచయం వునన్ ప్రముఖ రచయిత ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ ప్రకటించారు. ఈ పుస్తకంలో శ్రీదేవికి సంబంధించిన సమగ్ర సమాచారం వుంటుందని పేర్కొన్నారు. ఈ యేడాది చివర్లో ఈ పుస్తకాన్న వెస్ట్ ల్యాండ్ బుక్ సంస్థ విడుదల చేయనుంది.

Related Posts

Latest News Updates