రీసైకిల్డ్ సీసాలతో తయారు చేసిన జాకెట్ ధరించి, సందేశమిచ్చిన ప్రధాని మోదీ

రీసైకిల్ చేసిన PET బాటిల్స్ తో తయారు చేసిన బ్లూజాకెట్ ను ప్రధాని మోదీ ధరించారు. ఈ జాకెట్ ధరించే… ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్ ను మోదీకి బహూకరించింది. లేత నీలం రంగులో ఉన్న ఈ జాకెట్‌పై హరిత సందేశం రాసి ఉంది. బెంగళూరు వేదికగా రెండు రోజుల క్రితం జరిగిన ఎనర్జీ వీక్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్ ను మోదీకి బహూకరించింది.

https://twitter.com/bykarthikreddy/status/1622486957875171328?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1622486957875171328%7Ctwgr%5E6f85d3b24e77f92163a298d7b1663a6b3793855b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia

ప్లాస్టిక్ బాటిళ్లను పద్ధతి ప్రకారం రీసైక్లింగ్ చేసే కార్యక్రమాల ద్వారా మిషన్ లైఫ్ ను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఐఓసీ ఉద్యోగులు, రక్షణ దళాల సిబ్బంది కోసం వస్త్రాలను తయారు చేసేందుకు 10 కోట్లకుపైగా PET bottlesను రీసైకిల్ చేయబోతున్నారు. క్లైమేట్ ఛేంజ్ విషయంలో మోదీ ప్రభుత్వం ముందు నుంచి కూడా చాలా సీరియస్ గా వుంటోంది. మహాబలిపురం బీచ్ లో మోదీ స్వయంగా చెత్తను, బాటిళ్లను ఏరిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Posts

Latest News Updates