మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బాబీ దర్శకత్వం వహించారు. మాస్ మహారాజా రవితేజ ఇందులో కీరోల్ పోషించాడు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది. ఫిబ్రవరి 27 నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ప్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది.













