టర్కీ కేంద్రంగా అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. అయితే ఆ తర్వాత కూడా బలమైన భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. కనీసం 18 సార్లు భూమి రిక్టార్ స్కేల్‌పై 4 తీవ్రత కన్నా ఎక్కువ తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. భూకంపం వల్ల ఇప్పటి వరకు 500 మంది మరణించారు.
సుమారు 3 వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే భూప్రకంపనల్లో ఏడుసార్లు రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5 కన్నా ఎక్కువగా నమోదు అయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం వచ్చిన 11 నిమిషాల తర్వాత మరో బలమైన ప్రకంపన వచ్చిందని, అది రిక్టార్ స్కేల్‌పై 6.7 తీవ్రతగా ఉందని యూఎస్జీఎస్ పేర్కొన్నది.

అయితే రాబోయే మరికొన్ని గంటల్లోనూ శక్తివంతమైన ప్రకంపనలు ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వందల సంఖ్యలో భవంతులు కూలిపోయి, నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి కావడంతో ప్రజలందరూ గాఢ నిద్రలో వుండిపోయారు. దీంతో బయటికి పరుగులు తీసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో నరుద్గీకి 23 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూజి జియాలాజికల్ సర్వే తెలిపింది.












