సినీ హీరో నవీన్‌రెడ్డి అట్లూరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.55 కోట్ల మేర మోసం చేశారని ఎన్ స్క్వైర్ కంపెనీ డైరెక్టర్లు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్ స్క్వైర్ కంపెనీకి నవీన్ రెడ్డి అట్లూరి గతంలో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టుపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన డైరెక్టర్లు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 55 కోట్ల మేర నవీన్ రెడ్డి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.












