కర్నాటక బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా ‘ఉజ్వల మ్యాన్’…

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. మరోసారి దక్షిణాదిన పాగా వేసేందుకు బీజేపీ తెగ వ్యూహాలు వేస్తోంది. కొన్ని రోజుల క్రిందటే బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కూడా అయ్యారు. పార్టీ పరిస్థితి, వ్యూహంపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ లో కూడా కర్నాటకకు ప్రత్యేక నిధులు కేటాయించింది సర్కార్. అయితే.. కన్నడ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బీజేపీ అధిష్ఠానం ఇంచార్జీగా ప్రకటించింది. ఎన్నికల విషయాలు మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా నడవనున్నాయి. ఈ మేరకు బీజేపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక… కో ఇంచార్జీగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని ప్రకటించింది.

ఉజ్వల్ మ్యాన్ అని ప్రధాన్ కి ముద్దు పేరు…

ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రితో పాటు స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ :శాఖ కూడా చూస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ లో ప్రొఫైల్ మెంటెయిన్ చేస్తూ వుంటారు. ఏబీవీపీలో విద్యార్థి నేతగా వుంటూ.. బీజేపీలోకి అడుగుపెట్టారు. సంస్థాగతంగా బాగా పట్టుంటుందని ఆయనకు పేరు. గతంలోనూ ఆయన పలు రాష్ట్రాలకు ఇంచార్జీగా పనిచేశారు. 2004 లో దియోగఢ్ లోకసభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆపై బిహార్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక… గతంలో పెట్రోలియం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈయన హయాంలోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభమైంది. అందుకే ఆయన్ను ఉజ్వల మ్యాన్ గా పిలుస్తుంటారు.

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేంద్రం వరాలిచ్చింది. పార్లమెంటులో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో కర్ణాటక రాష్ట్రానికి రూ.5,300 కోట్ల కేంద్ర నిధులు  కేటాయించింది.కర్ణాటక రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో సాగునీటి సరఫరా  కోసం ఈ నిధులను వెచ్చిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.  ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కేంద్ర నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలసీతారామన్ ప్రకటించారు.

 

Related Posts

Latest News Updates