కె. విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖుల నివాళులు

కళా తపస్వి కె. విశ్వనాథ్ మరణంపై అటు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ తమ తమ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్ రూపొందించిన సినిమాలను తలుచుకుంటున్నారు.

ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే విశ్వనాథ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కే విశ్వనాథ్‌ అని కొనియాడారు. గతంలో కే విశ్వనాథ్‌ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని సీఎం పేర్కొన్నారు. సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా మానవ సబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా, దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కే విశ్వనాథ్‌ అని అన్నారు.

కె.విశ్వనాథ్‌ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు’ అంటూ ట్వీట్ చేశారు.

కళాతపస్వి దర్శక రుషి కే.విశ్వనాథ్‌ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తంచేశారు. క తెలిపారు. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాని అన్నారు. వారి కుటుంబ సభ్యుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ గారు, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి.’ అని వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.

 

Related Posts

Latest News Updates