త్వరలో వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిజమే… ఈ విషయాన్ని తండ్రి నాగబాబు స్వయంగా ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబును ఈ విషయంపై అడగ్గా.. అసలు విషయాన్ని ప్రకటించాడు. వరుణ్ తేజ్ పెళ్లి త్వరలోనే వుంటుందని తెలిపాడు. అయితే… ఎవర్ని పెళ్లి చేసుకోనున్నాడు అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్పలేనని స్పష్టం చేశాడు. కాబోయే తన భార్య గురించి వరుణ్ తేజే స్వయంగా చెబుతాడని, అదే బాగుంటుందన్నాడు. త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుంది. ఈ విషయాన్ని వరుణ్ చెబుతాడు. అమ్మాయి ఎవరనేది కూడా వరుణ్ చెబుతాడు. ఇప్పుడే నేనేమీ చెప్పలేను. పెళ్లి తర్వాత తను వేరే ఇంట్లో ఉంటాడు. మేం వేరే ఉంటాం. ఎందుకంటే నా బిడ్డలకు ప్రైవసీ ఇవ్వడం అలవాటు. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా మా బాండింగ్ మాత్రం ఎప్పుడూ బలంగానే ఉంటుంది’ అని అన్నాడు.












