ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. జగన్ ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 5.03 గంటలకు బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 5.27 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అయితే, విమానం ఏసీ వాల్వ్‌లో లీకేజీ కారణంగా ప్రైజరేజేషన్ సమస్య తలెత్తినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా, ఢిల్లీకి బయలుదేరారు. విమానంలో సాంకేతిక లోపం నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకొని తాడేపల్లి గూడెంలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు