విషమంగానే తారకరత్న ఆరోగ్యం

నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. డాక్టర్లు తారకరత్న హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరికొన్ని రోజుల పాటు ఆయనకు చికిత్స అందించాలన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందిస్తున్నామన్నారు. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో ఆయన్ను బతికించేందుకు నారాయణ హృదయాలయ వైద్యలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెలూన్ యాంజియోప్లాజీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నందమూరి తారకరత్న పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలిసి నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పతికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుండగా,  మోహన్ కృష్ణ, నారా చంద్రబాబు, భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు.  ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ తారకరత్న పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. సోమవారం మరోసారి పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పినట్టు పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates