నేటి విచారణకు రాలేను… 5 రోజుల తర్వాత ఎప్పుడైనా ఓకే.. సీబీఐకి లేఖ రాసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ సోమవారం నోటీసులిచ్చింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే…. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. తాను విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. మరో 5 రోజుల పాటు తాను షెడ్యూల్ కార్యక్రమాల్లో బిజీగా వున్నానని, 5 రోజుల తర్వాత ఎప్పుడైనా విచారణకు వచ్చేందుకు సిద్ధమని ఎంపీ అవినాశ్ లేఖలో స్పష్టం చేశారు.

ఈ మేరకు సీబీఐ అధికారులకు ఫోన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం తన నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాలు ఉన్నాయని.. మరో నాలుగు రోజుల పాటూ బిజీగా ఉంటానని ఎంపీ అంటున్నారు. అయితే.. అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయయన పీఏ రాఘవ రెడ్డికి సీబీఐ నోటీసులు అందజేసింది. సోమవారం ఉదయం పులివెందులకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. అయితే.. ఎంపీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోయారు.

 

దీంతో చివరికి పీఏకి నోటీసులిచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసును సీబీఐ 2 సంవత్సరాలుగా విచారిస్తోంది. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులివ్వలేదు. ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులివ్వడం ఇదే మొదటి సారి. 2019 మార్చి 15 న పులివెందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అప్పటి ప్రభుత్వం దీనిపై సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఈ కేసు హైకోర్టుకు చేరింది. దీనిని దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Related Posts

Latest News Updates