కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ వంటకాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు తమ వంటకాల్లో బాగా కారం తింటారన్నారు. అంత ఘాటు కూరలను తాను తినలేనని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేకంగా ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగినప్పుడు తెలంగాణ రుచులను తిన్నానని, అయితే బాగా కారంగా వున్నదన్నారు. అయితే.. టేస్ట్ మాత్రం అద్భుతంగా వుండేదని గుర్తు చేసుకున్నారు. అయితే.. భారత్ జోడో యాత్ర సందర్భంగా అన్ని రాష్ట్రాల వంటకాలనూ రుచి చూశానన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు డైట్ విషయంలో కఠినంగా ఉంటానని, కానీ యాత్రలో అన్నీ ఉండవు కదా అని అన్నారు. ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తానని, కానీ బఠాణీ, పనసపండు నచ్చవు అని చెప్పుకొచ్చారు.

ఇక భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన లోకల్‌ ఫుడ్స్‌నే ఎక్కువగా ఆస్వాదించారట. ఇటీవల మహారాష్ట్రలో కూడా భక్రిని ఇష్టపడి తిన్నారట. అయితే ఏ ఫుడ్‌ తీసుకున్నా కంట్రోల్ డైట్ తప్పకుండా పాటిస్తానని చెప్పారు. ఇక నాన్ వెజ్‌లో చికెన్, మటన్, సీ ఫుడ్ తినడమంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. చికెన్ టిక్కా, సీక్ కబాబ్. అలాగే ఆమ్లెట్ తినడానికి చాలా ఇష్టపడతానని, ఇక ఢిల్లీలో మోతీ మహల్, సాగర్, స్వాగత్, శరవణ భవన్ ఆయనకు ఇష్టమైన రెస్టారెంట్లు అని తెలిపారు.

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తాను ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చిందని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. ‘నానమ్మ(ఇందిరాగాంధీ) చనిపోయిన తర్వాత తనను బోర్డింగ్‌ స్కూల్‌ నుంచి తీసుకువచ్చారన్నారు. ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని, ఉన్నత విద్య కోసం హార్వర్డ్‌కు వెళ్లానని తెలిపారు. కేంబ్రిడ్జిలో డెవల్‌పమెంట్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేశానని, తన తండ్రి హత్య తర్వాత నన్ను ఫ్లోరిడాకు పంపించారని, చదువు పూర్తయ్యాక లండన్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేశాను’