‘హంట్’ మూవీ ట్రైలర్ లాంఛ్…. ఎమోషనల్ అయిన యాక్టర్ సుధీర్ బాబు

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ హంట్. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భరత్ నివాస్, శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రాల్లో నటిస్తున్నారు. ఉదయం 10 :30 గంటలకు ఏబీఎం మాల్ లో ఈ సినిమా ట్రైలర్ ను లాంఛ్ చేశారు. హీరో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, డైరెక్టర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. కృష్ణ గారు చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ రిలీజ్. ఆయన లేని వెలితి ఏంటో కనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రతీ మూవీ ఆయనే ఫస్ట్ షో చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఫీల్ అయ్యాడు. లైఫ్ లో తాను ఎక్కడ ఉన్నా ఎంత దూరం వెళ్లినా. నా జీవితం ఆయనకే అంకితం అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక… హీరో శ్రీకాంత్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా గోపురాజ్ రమణ, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

Related Posts

Latest News Updates