వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దుమ్ము దుమారం రేపుతోంది. ఇందులో రవితేజ కూడా కీలక పాత్ర పోషించారు. కేథరిన్, శ్రుతిహసన్, ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. అయితే… ఈ సినిమాపై వివిధ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ రేటింగ్స్ ఇవ్వడం సహజం. వారి వారి మెచూరిటీ బట్టి, రేటింగ్స్ ఇస్తుంటారు. అయితే.. ఈ రేటింగ్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జోకులు కూడా వేశారు. అయితే… ఈ జోకులు ఎవ్వర్నీ ఉద్దేశించి వేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. వాల్తేరు వీరయ్యను యూఎస్ ప్రీమియర్స్ చూసి అక్కడి వెబ్ సైట్స్ లో సినిమా రివ్యూలు రాశారు.
ఈ చిత్రానికి 2.5 రేటింగ్స్ ఇచ్చారని, అయితే దానిని చూసి బాధపడకూడదని అనుకున్నానని తెలిపారు. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అన్న నమ్మకం తనకు వుందని క్లారిటీ ఒచ్చారు. రౌడీ అల్లుడు, అన్నయ్య, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు ఎలా హిట్ కొట్టాయో…. అంతటి ఎంటర్ టైన్ మెంట్ వుందని చిరంజీవి వివరించారు. అందుకే వాళ్ల రేటింగ్స్ ని పట్టించుకోనని అన్నారు. అయితే.. ఆ తర్వాత 2.5 అంటే 2.5 మిలియన్ల డాలర్లు అని, యూఎస్ లో అంత రెవిన్యూ వస్తుందని వాళ్లు ముందే చెప్పారని, తామే పొరపాటు పడ్డామని తెలిసింది అంటూ చిరంజీవి నవ్వించారు.












