అంధకారంలో పాకిస్తాన్.. ప్రధాన నరగాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం

పాకిస్తాన్ అంధకారమయమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పలు చోట్ల విద్యుత్ లేకుండా పోయింది. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాలు అంధకారంలో వుండిపోయాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇక.. క్వెట్టా సహా బలూచిస్తాన్ లోని 22 జిల్లాల్లో విద్యుత్ సరఫరా లేదని అధికారులు కూడా పేర్కొన్నారు.

 

ట్రాన్స్మిషన్ లైన్లలో లోపం కారణంగానే దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే గ్రిడ్ ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేదని, అందుకే బ్రేక్ డౌన్ కు కారణమైందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. సిస్టమ్ ను పునరుద్ధరించే పనులు వేగిరంగా సాగుతూనే వున్నాయన్నారు. గత యేడాది అక్టోబర్ మాసంలోనూ పాకిస్తాన్ లో కరెంట్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Related Posts

Latest News Updates