అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రహస్య పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా, మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల విషయంలో చర్చ నడుస్తోంది. భారత సంతతికి చెందిన మహిళ నిక్కీ హేలీ  అమెరికా అధ్యక్ష బరిలో నిలవనున్నారు.ఈ క్రమంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆమె మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమె త్వరలోనే దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.   ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్ నేత జో బైడెన్కు మరో అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? ఆ కొత్త నాయకత్వానికి తానే నేతృత్వం వహించాలా? అనే విషయాలపై ఆలోచించాలని చెప్పారు. ప్రస్తుతం అమెరికాకు కొత్త నాయకత్వం అవసరం అనేది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. అమెరికాను కొత్త బాటలో నడిపించగలనన్న నిక్కీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడు రేసులో ఓడిపోలేదని గుర్తు చేశారు. అలాగే ఇక మీదట కూడా ఓడిపోనని చెప్పారు. రాజకీయాలతో పాటు దౌత్యపర అంశాల్లోనూ  నిక్కీ హేలీ  మంచి అనుభవం ఉంది. గతంలో హేలీ సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2017 నుంచి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు.

Related Posts

Latest News Updates