మరో 2 నెలల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోంది : మంత్రి అమర్నాథ్ ప్రకటన

విశాఖపట్నంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలనా రాజధాని కాబోతోందని ప్రకటించారు. ఇన్ఫినిటి వైజాగ్ సదస్సు విశాఖలో జరిగింది. ఈ సందర్భంగానే మంత్రి అమర్నాథ్ పై వ్యాఖ్యలు చేశారు. విశాఖలో త్వరలోనే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని, ఐటీ హబ్ గా విశాఖను మార్చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అదాని డేటా సెంటర్ ను కూడా ప్రారంభిస్తామని, విశాఖను ఐటీ హబ్ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. మంత్రి అమర్నాథ్ ప్రకటన చూస్తుంటే… విశాఖ కేపిటల్ దిశగా జగన్ సర్కార్ ముందుకు కదులుతున్నట్లు స్పష్టమైపోయింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లులను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం వుంది.

Related Posts

Latest News Updates