స్వదేశీ టెక్నాలజీ తయారు చేసిన వందే భారత్ రైల్ పైకి రాళ్లు రువ్విన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. బిహార్ కటిహార్ లో కొందరు ఆకతాయిలు వందే భారత్ రైల్ పైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు అద్దం పగిలిపోయింది. అయితే.. ప్రయాణికులెవ్వరూ గాయపడలేదని అధికారులు ప్రకటించారు. బోగి నెంబర్ సీ6 అద్దాలు మాత్రం ధ్వంసమైందని పేర్కొన్నారు.
న్యూజల్పాయ్ గురించి నుంచి శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ రైలు ప్రారంభమైంది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో బిహార్ డకోలా టెల్టా స్టేషన్ దగ్గర చేరుకునే సరికి, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కొన్ని రోజుల క్రిందటే విశాఖ పట్నం దగ్గర కూడా రైలుపై దుండగులు రాళ్లు రువ్వారు. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతుండటంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా వుంది.












