ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న ఆయన రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

 

వాస్తవానికి ఈ నెల 19 నే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రావాల్సి వుంది. సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ రైలును ప్రారంభించడానికి రావాల్సి వుంది. కానీ… అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దైందని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇది తాత్కాలిక వాయిదా మాత్రమేనని, అతి త్వరలోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తేదీని ప్రకటిస్తామని పీఎంవో పేర్కొన్న విషయం తెలిసిందే.