జమ్మూ కశ్మీర్ నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 6గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ నగర్ యార్డ్ నెంబర్ 7 లో ఈ జంట పేలుళ్ల ఘటన జరిగింది. ఉదయం 10.47 నిమిషాలకు ఒక కారు బాంబు పేలుడు చోటుచేసుకోగా, మరో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే మరో బాంబు పేలినట్టు తెలుస్తోంది.

జంట కారు పేలుళ్ల ఘటనను జమ్మూ ఏడీజీ ముఖేష్ సింగ్ ధ్రువీకరించారు. సమాచారం తెలియగానే పోలీసులు, బాంబ్ డిస్కోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకున్నారని, ఇవి ఏ తరహా పేలుళ్లనేవి నిర్ధారించేందుకు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర జరుగుతుండటం, రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా దగ్గర్లోనే వుండటంతో స్థానిక యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.












