హైదరాబాద్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ ముందుకు వచ్చింది. 2030 నాటికి 36,300 కోట్లతో వెబ్ సర్వీసెస్ ను విస్తరిస్తామని సంస్థ కీలక ప్రకటన చేసింది. దావోస్ పర్యటనలో వున్న మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అమెజాన్ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. మొదటి దశలో రూ.20,096 కోట్లు పెట్టుబడి పెట్టిన అమెజాన్‌‌‌‌.. ఇప్పుడు ఆ సేవలను విస్తరించడానికి సిద్ధమైంది. తెలంగాణకు వస్తున్న అతిపెద్ద ఎఫ్‌‌‌‌డీఐల్లో ఇది ఒకటని కేటీఆర్‌‌‌‌ అన్నారు. ఈ-గవర్నెన్స్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో ప్రభుత్వ కార్యకలాపాలు మెరుగుపరచడానికి అమెజాన్‌‌‌‌ వెబ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌తో కలిసి తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.