సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలేనని తెలిపారు. బడ్జెట్ కోసం ప్రభుత్వం అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తుందని ఆరోపించారు. ఆదాయం కోసం అక్రమ నిర్మాణాలకు అనుమతివ్వొద్దని సూచించారు. అగ్నిప్రమాదం జరిగిన ఘటనను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని చెప్పారు. చట్ట వ్యతిరేక గోడౌన్ లపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

బిల్డింగ్ చుట్టుపక్కల వాళ్లు కూడా నష్టపోయారని.. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. బడ్జెట్ కోసం ప్రభుత్వం అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తుందని ఆరోపించారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఐదు ఫ్లోర్లకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశముందని అధికారులు అంటున్నారు. బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిలో ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.