ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1 పై సుప్రీం కోర్టు స్పందించింది. జీవో నెం.1 పై విచారణను ముగిస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నెం.1 పై జోక్యం చేసుకోలేమని, ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనమే దీనిపై విచారణ చేపడుతుందని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. వాద, ప్రతివాదులందరూ ఆ డివిజన్ బెంచ్ ముందే అన్ని అంశాలు ప్రస్తావించుకునే స్వేచ్ఛ వుందని సుప్రీం పేర్కొంది. జీవో నెం.1 ని నిలిపేస్తూ… ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం ఈ పిటిషన్ స్వీకరించి, పై వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం పక్షాన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తన వాదనలు వినిపించారు.












