ATM : కొత్త కథలకు ఓటీటీ ప్లాట్ ఫామ్ బాగుంటుంది : హరీశ్ శంకర్

హరీశ్ శంకర్, జీ5, ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో రాబోతున్న వెబ్ సిరీస్ ATM.ఈ వెబ్ సిరీస్ కి సి. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్లుననారు. నేడే ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. దీంతో ఈ మూవీ మేకర్స్ గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కొత్తగా కథలను చెప్పటానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బావుంటుంద‌ని ఆలోచన వ‌చ్చిందని హరీశ్ శంకర్ అన్నాడు. అప్పుడు జీ 5 టీమ్‌తో క‌లిశానని, ఈ క‌థ‌ను తానే రాశానన్నాడు. కానీ.. డైరెక్ట‌ర్‌గా నాకంటే చంద్ర మోహ‌న్ బాగా తీశాడ‌నిపించింది. అంత బాగా తీశాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ టైమ్‌లో సినిమా చూశానని తెలిపాడు. చంద్ర‌లో మంచి కామెడీ టైమింగ్ ఉందని, త‌ను సుబ్బ‌రాజుగారికి క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు చాలా బావుందని మెచ్చుకున్నాడు. రెండున్న‌ర గంట‌ల కంటెంట్‌ను తీయ‌టానికి మాకు వంద రోజులు ప‌డుతుందని వివరించాడు.

ఇక… దిల్ రాజు మాట్లాడుతూ… ‘‘జీ 5కి కంగ్రాట్యులేషన్స్. మాతో ఓ వెబ్ సిరీస్ చేయించారు. 25 ఏళ్లు డిస్ట్రిబ్యూట‌ర్‌గా, 20 ఏళ్లు నిర్మాత‌గా ఉన్నాను. హ‌రీష్ శంక‌ర్ వెబ్ సిరీస్ చేద్దామ‌ని నాతో చెప్పిప్పుడు ఇప్పుడు వెబ్ సిరీస్‌లేంటి అన్నాను. కానీ ముందు త‌ను క‌థ విన‌మంటే విన్నాను.. న‌చ్చింది. మా ఫ్యామిలీ నుంచి మా అబ్బాయి హ‌ర్షిత్‌, అమ్మాయి హ‌న్షితల‌ను నిర్మాత‌లుగా మార్చి ఈ వెబ్ సిరీస్ చేయించాం. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా ట్రైల‌ర్‌గానే అనిపించింది. చంద్ర మోహ‌న్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు న‌చ్చింది. అని తెలిపాడు.

ఇక.. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ… ‘దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ (Dil Raju Productions) అనే బ్యాన‌ర్‌పై సినిమాలు చేస్తున్న హ‌ర్షిత్‌, హ‌న్షిత‌ల‌కు అభినంద‌న‌లు. కొత్త మాధ్య‌మంలోకి అడుగు పెట్టారు. హ‌రీష్ ఈ సిరీస్‌కు క‌థ‌ను అందించటంతో పాటు షో ర‌న్న‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు. బిగ్ స్క్రీన్‌పై చెప్ప‌లేక‌పోతున్న క‌థ‌ల‌ను ఓటీటీల్లో చెప్ప‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న హ‌రీష్‌ను ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను. అని అన్నాడు.

Related Posts

Latest News Updates