కిరణ్ అబ్బవరం హీరోగా మురళీ కిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఓ బంగారం అనే పాటను మూవీ మేకర్స్ గుంటూరులో విడుదల చేశారు. చేతన్ భరద్వాజ్ ఈ పాటకు సంగీతం అందించగా… కపిలన్ పాడాడు. ఓ బంగారం… నీ చేయి తాకగానే.. ఎప్పొంగిపోయిందే నా ప్రాణం అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సినిమాలో ఈ సాంగ్ చాలా స్పెషల్ గా వుంటుందని హీరో కిరణ్ తెలిపాడు. ఈ పాట అందరికీ నచ్చుతుందని, సినిమా కూడా నచ్చుతుందన్నాడు.












