ఉపాధి కల్పనలో ‘రోజ్ గార్ మేళా’ ఓ ఉత్ప్రేరకం : ప్రధాని మోదీ

రోజ్ గార్ మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో చేరిన 71 వేల మందికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారితో వర్చువల్ గా సంభాషించారు. కేంద్రప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు,కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్‌మెంట్లకు నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలను అందజేసిన తర్వాత కొంత మందితో మోదీ సంభాషించారు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోదీ నిబద్ధతకు ఇదో ముందడుగు అని పీఎంవో పేర్కొంది.

ఉపాధి కల్పనలో రోజ్ గార్ మేళా ఓ ఉత్ప్రేకరంగా పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. యువతకు సాధికారత కల్పించడంతో పాటు, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను అందిస్తుందని వివరించారు. సుపరిపాలనకు రోజ్ గార్ మేళాయే ఓ నమూనా అని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఇదో టెస్టింగ్ సమయం అని అభివర్ణించారు. వ్యాపారంలో వినియోగదారుడే ముఖ్యమని, అలాగే… తమకు ప్రజలే ముఖ్యులని మోదీ అభివర్ణించారు.

Related Posts

Latest News Updates