వాల్తేరు వీరయ్య షూటింగ్ తో బిజీ బిజీ గడిపిన మెగాస్టార్…. మళ్లీ షూటింగ్ లో మునిగిపోయారు. మరో సినిమా షూటింగ్ లో ప్రారంభించారు. ప్రస్తుతం మెహర్‌రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మెహర్ రమేశ్ అండ్ టీం సెట్స్ లోకి చిరుకు ఘనస్వాగతం పలికింది. అనంతరం భోళా శంకర్ పోస్టర్ ముందు డైరెక్టర్ అండ్ టీం సమక్షంలో కేక్ కట్ చేశాడు చిరంజీవి. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సందర్భంగా టీంకు ధన్యవాదాలు తెలియజేశాడు చిరు. భోళా శంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. భోళా శంకర్‌లోలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
https://twitter.com/KChiruTweets/status/1616054304208715777?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1616054304208715777%7Ctwgr%5E0d5e8119f130b71216f1695c72b0e49af495b1c1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fchiranjeevi-welcomed-by-bhola-shankar-team-into-sets-933746













