అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర బడ్జెట్ సమాచారాన్ని విదేశాలకు లీక్ చేస్తున్న ఆర్థిక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి సుమిత్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక శాఖలో సుమిత్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకి చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందజేస్తూ… బదులుగా భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక… ఆ ఉద్యోగి నుంచి పోలీసులు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.












