మోహన్ లాల్ మూవీ ”మలైకొట్టె వాలిబాన్” షూటింగ్ షురూ

మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీ వున్నాడు. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో మలైకొట్టె వాలిబాన్ అనే సినిమాలో నటిస్తున్నాు. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ప్రారంభమైంది. కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను మోహన్ లాల్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలైకొట్టై వాలిబన్‌లో బాలీవుడ్ యాక్టర్‌ విద్యుత్‌ జమ్వాల్‌, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే… ఈ సినిమాలో కమల్ హసన్ కూడా నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. క్లారిటీ మాత్రం రావడం లేదు.

Related Posts

Latest News Updates