ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన… మార్చి 2 న ఫలితాలు

మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16 న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. మేఘాలయాలో ఫిబ్రవరి 27న, నాగాలాండ్ లో ఫిబ్రవరి 27 న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే… ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2 న వెలువడతాయని ప్రకటించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌ కి తెలియజేయవచ్చునని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామని చెప్పారు. నాగాలాండ్ శాసనసభ పదవీ కాలం మార్చి 12 న, మేఘాలయా అసెంబ్లీ పదవీ కాలం మార్చి 15 న, త్రిపుర శాసనసభ పదవీ కాలం మార్చి 22తో ముగియనుంది.

 

త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. నాగాలాండ్‌ను నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ పరిపాలిస్తోంది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తంగా 180 స్థానాలకు ఎన్నికలు జరుగతాయి. మొత్తం 9125 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనేనని రాజీవ్ కుమార్ తెలిపారు. 70 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ సదుపాయం అందుబాటులో వుంటుందని రాజీవ్ కుమార్ ప్రకటించారు.

Related Posts

Latest News Updates