తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ మళ్లీ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. 35 టీమ్ లుగా ఐటీ అధికారులు దాడులు చేశారు. రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సియర్స్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లోని ప్రముఖ వ్యాపారవేత్త కార్యాలయంలో, నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆదిత్య కన్‌స్ట్రక్షన్, ఊర్జిత ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్‌పిఎఫ్ బలగాల మధ్య ఏక కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ దాఖలులో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.