భోళా శంకర్ చిత్రం షూటింగ్ పున: ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం షూటింగ్ పున: ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా భారీ కోల్ కతా సెట్ లో షూటింగా మళ్లీ ప్రారంభమైంది. చిరంజీవిని మెహర్ రమేష్ స్టైలిష్ ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.

 

ఇందులో చిరంజీవిని స్టైలిష్, మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా చూపిస్తున్నారు. ఇక… మొదట ఈ సినిమాను ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే… ఏప్రిల్లో రిలీజ్ కావడం లేదని రమేశ్ తెలిపాడు. ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ 30 శాతమే అయ్యిందని, 17 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని ప్రకటించారు. దీంతో నిన్నటి నుంచి షెడ్యూల్ ప్రారంభమైంది.

Related Posts

Latest News Updates