జీవో నెం.1 పై సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కార్

జీవో నెం.1 పై ఏపీ ప్రభుత్వం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు దీనిపై కొన్ని రోజుల క్రితం తాత్కాలిక స్టేను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ మేరకు ఓ స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. జీవో నెం.1 అమలును ఈ నెల 23 వరకూ నిలిపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ ఈ జీవో నెం.1 ని తప్పుబడుతూ హైకోర్టును ఆశ్రయించారు. రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయ పార్టీల గొంతును ప్రభుత్వం నొక్కుతోందని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 23 వరకూ నిలిపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర తీర్పునిచ్చింది.

 

1861 పోలీస్‌యాక్ట్‌కు లోబడే జీవో నెం.1 తెచ్చామని అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అన్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలు ఆపేందుకే జీవో 1 తెచ్చామన్నది అవాస్తవమన్నారు. కందుకూరు, గుంటూరు  విషాద ఘటనల దృష్ట్యా జీవో 1 తెచ్చామని పేర్కొన్నారు. ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం విధించలేదని డీజీ రవిశంకర్‌ తెలిపారు. కొన్ని కీలక ప్రాంతాల్లోనే వీటిని నియంత్రించాలని చెప్పామన్నారు. అలాగే హైవేలపై పబ్లిక్ మీటింగ్స్‌ పెట్టకూడదని చెప్పామన్నారు. షరతులతో సభలు, సమావేశాలకు అనుమతి ఉంటుందన్నారు.

Related Posts

Latest News Updates