పవన్ కల్యాణ్ పై పోటీకి రెడీ… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అలీ

సినిమాలు వేరు, రాజకీయాలు వేరంటూ నటుడు, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా వున్నానని బాంబు పేల్చారు. 2024 ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లలో వైసీపీ విజయం ఖాయమన్నారు. పవన్ కల్యాణ్, అలీ మధ్య స్నేహం చాలా పాతది. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఒకరంటే ఒకరికి మహా ప్రీతి. అయితే… ఈ మధ్య ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. వైసీపీ, జనసేన ప్రత్యర్థి పార్టీలయ్యాయి. అలీ వైసీపీకి మద్దతిస్తుంటే… పవన్ సాక్షాత్తూ జనసేన అధ్యక్షుడు. అయితే… సినిమా, రాజకీయం వేరని, పవన్ పై పోటీ చేసేందుకు సిద్ధమని అలీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం, సీఎం జగన్ పోటీ చేయమంటే రెడీ అంటూ ప్రకటించారు.

Related Posts

Latest News Updates