హైపర్ ఆది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా

జబర్దస్త్ హైపర్ ఆదిపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. జనసేన యువశక్తి సభ వేదికగా హైపర్ ఆది మంత్రి రోజాపై విమర్శలు చేశాడు. దీనిపై మంత్రి రోజా స్పందించారు. పాపం చిన్న ఆర్టిస్టులు.. చిన్న చిన్న షోలు, పాత్రలు చేసుకునే వారు.. వారిపై ఎందుకు ప్రతాపం చూపించడం అంటూ ఎద్దేవా చేశారు. వారి వెనుక ఎవరు వుండి ఇవన్నీ అనిపిస్తున్నారో వారిని అనాలని, ఇలాంటి సభలో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకునే పరిస్థితికి పవన్ దిగజారిపోయారని రోజా ఎద్దేవా చేశారు. వారు కూడా మెగాస్టార్ కుటుంబంతో ఎక్కడ విరోధం, గొడవలు పెట్టుకుంటే.. కెరీర్ దెబ్బతింటుందన్న భయంలో వుంటారని, అందుకే ఏది పడితే అది మాట్లాడుతుంటారని అన్నారు. వైసీపీ కేబినెట్ లో అసలు శాఖలే మంత్రులకు తెలియవని, శాఖలు తెలియకుండానే మంత్రులం ఎలా అయ్యామని రోజా ప్రశ్నించారు. ప్రజలు చాలా తెలివైన వారని, ఎవరు ఎలాంటి వారో వారికి బాగా తెలుసని రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related Posts

Latest News Updates