బిచ్చగాడు ఫేమ్ హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం

బిచ్చగాడు ఫేమ్ హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం జరిగింది. మలేషియాలో బిచ్చగాడు2 కోసం ఓ యాక్షన్ సీన్ ని తీస్తుండగా విజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వాటర్ బోట్ ఛేజింగ్ సీన్ ని షూట్ చేస్తుండగా.. బోట్ అదుపు తప్పి, మరో బోట్ ను ఢీకొట్టింది. దీంతో విజయ్ గాయపడ్డారు. వెంటనే అతడ్ని కౌలాలంపూర్ లోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో బిచ్చగాడు -2 షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నాడని, మేజర్‌గా దెబ్బలేవి తగడం లేదని చెప్పారు. అంతేకాకుండా విజయ్‌ వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్‌లు తెలిపారు. విజయ్‌ తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related Posts

Latest News Updates