బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా తిరిగి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2024 వరకూ జేపీ నడ్డాయే అధ్యక్ష బాధ్యతలు నెరవేరుస్తారని ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నిర్ణయం తీసుకుందని అమిత్ షా వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. 2024 జూన్ వరకూ జేపీ నడ్డా పదవిలో కొనసాగుతారు అని అమిత్ షా తెలిపారు.

బెంగాల్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ లో నడ్డా సారథ్యంలో బీజేపీ బాగా విస్తరించిందని అమిత్ షా పేర్కొన్నారు. తిరిగి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ప్రధాని మోదీతో సహా.. బీజేపీ నేతలందరూ జేపీ నడ్డాకి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు నడ్డా సారథ్యంలోనే జరుగుతాయని ప్రకటించారు. ఇలా అధ్యక్షుల పదవీ కాలం కొనసాగింపు పార్టీలో గతంలోనూ జరిగిందని గుర్తు చేశారు. బీజేపీ పూర్తి ప్రజాస్వామ్య పార్టీ అని అన్నారు.
HM Shri @AmitShah addresses a press conference at NDMC Convention Centre, New Delhi. #BJPNEC2023 https://t.co/5vEppCBVbu
— BJP (@BJP4India) January 17, 2023












