అమెరికాలో కాల్పులు… ఆరు నెలల చిన్నారి సహా ఆరుగురి దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. సెంట్రల్ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల చిన్నారి సహా ఆరుగురు మరణించారు. దుండగులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ కాల్పులు యాదృచ్చికంగా జరిపినవి కాదని, కుటుంబాన్ని టార్గెట్ చేసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు . అయితే ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు వారు భావిస్తున్నారు.

కాలిపోర్నియా రాష్ట్రం విసాలియా నగరంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని. స్థానికంగా ఉండే ఓ ఇంట్లో బలవంతంగా చోరబడిన ఇద్దరు సాయుధులు కుటుంబ సభ్యులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల ఉండేవారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అక్కడికి వెళ్లిన తులారే కౌంటీ పోలీసులు ఆ ఇంట్లో ఐదు మృతదేహాలను గుర్తించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఉండగా అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతడు మృతిచెందాడని పోలీసులు చెప్పారు.

Related Posts

Latest News Updates