బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోశ్, జాతీయ పదాధికారులు పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ, మురళీధర్ రావు, ఈటల రాజేందర్, వివేక్, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, సోము వీర్రాజు పాల్గొన్నారు. రెండు రోజుల పాటుఈ సమావేశాలు జరుగుతాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఇందులో చర్చించనున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, తీర్మానాలపై సమావేశాల్లో అజెండా ఖరారు చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు 35మంది కేంద్ర మంత్రులు, 12 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 37 రాష్ట్రాలు – కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, మరో 27 మంది (సంఘటన్ మంత్రులు, మహా మంత్రులు, క్షేత్రీయ సంఘటన్ మంత్రులు) పాల్గొంటారు.