సినీ గేయ రచయిత చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. తెలుగు వారందరి తరపున చంద్రబోస్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు చిరంజీవి. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు అంటూ చిరంజీవి అభివర్ణించారు. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది.

ఈ నేపథ్యంలో చిరంజీవి ఆయన్ను ప్రత్యేకంగా సత్కరించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో చంద్రబోస్ ను చిరంజీవి, రవితేజ సన్మానించారు. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. కీరవాణితోపాటు పాటలో భాగస్వాములైన వారందరికి చిరు అభినందనలు తెలియజేశారు. తెలుగు వాళ్లందరి తరపున చంద్రబోస్ కు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు చెప్పారు.












