సహజనటి జయసుధ మూడో పెళ్లిపై సోషల్ మీడియాలో తెగ పుకార్లు నడుస్తున్నాయి. ఇప్పటికే జయసుధ మూడో పెళ్లి చేసేసుకున్నారని ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లి… ఆమె అక్కడి వ్యాపారవేత్తను రహస్యంగా వివాహం చేసుకున్నారని పలు వెబ్ సైట్లలో వార్తలు ప్రత్యక్షమయ్యాయి. అయితే… దీనిపై స్వయంగా జయసుధ వివరణ ఇచ్చారు. ఈ వార్తను ఖండించింది. మూడో పెళ్లి అనే దానిలో ఏమాత్రం వాస్తవం లేదని, అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని తెలిపింది. తన బయోపిక్ తీసేందుకే ఆయన ఇండియాకి వచ్చాడని తేల్చి చెప్పింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి తనతోనే ఉంటూ గమనిస్తున్నాడని పేర్కొంది. అంతేకాకుండా స్పిరిచ్యువల్ బయోపిక్ కావడంతో నేను క్రిస్టియానిటీలోకి ఎలా మారాను? అంతకుముందు నా జీవితం ఎలా ఉండేది అని తెలుసుకుంటాడని తెలిపారు.












