అంబటి డ్యాన్స్ అదుర్స్… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి డ్యాన్స్

తెలుగు ప్రజలు భోగి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తమ ఇళ్ల ముందు భోగి మంటలను ఏర్పాటు చేసి, సంప్రదాయకంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి స్టెప్పులేశారు. ఉత్సాహంగా ఆడిపాడారు. అక్కడున్న వారు మంత్రి స్టెప్పులకు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. అంబటి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భోగి సంబరాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి అన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు వున్నాయన్నారు.

Related Posts

Latest News Updates