10 నిమిషాలు.. రెండు బెదిరింపు కాల్స్.. గడ్కరీ కార్యాలయానికి బెదిరింపులు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామని దుండగుడు బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని నాగపూర్ పోలీసులు తెలిపారు. ఉదయం 11:30, 11:40 నిమిషాలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల కాల్స్ నేపథ్యంలో ఆయన కార్యాలయానికి భద్రతను పెంచామని స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. ఆకతాయిల పనా? సీరియస్ వార్నింగా? అని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related Posts

Latest News Updates