హాలివుడ్ దిగ్గజం, దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ తో దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కీరవాణి, రాజమౌళి కుటుంబాలు అమెరికాకు వెళ్లాయి. అక్కడ జరిగిన యూనివర్సల్ పార్టీలో వీరు పాల్గొన్నారు. ఇదే పార్టీలో హాలివుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే కీరవాణి, రాజమౌళి ఇద్దరూ… స్పిల్ బర్గ్ ను కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆ ఫొటోలను షేర్ చేశారు. దాంతో పాటు ఇప్పుడే దేవుడిని కలిశాననే క్యాప్షన్ ను, లవ్ సింబల్స్, ఫైర్ సింబల్స్ తో జోడించారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/ssrajamouli/status/1614107808680792064?s=20&t=txbSq81j91Ncb_wiopLw6w












