ఆది పురుష్ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన పిల్ పై కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కు నోటీసులిచ్చింది. పిటిషన్ పై స్పందించాలని కోరింది. కుల్దీప్ అనే వ్యక్తి ఆదిపురుష్ టీజర్‌పై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రాకుండానే టీజర్‌ను విడుదల చేశారని పిటీషన్లో పేర్కొన్నాడు. సీతాదేవి పాత్రలో నటిస్తున్న కృతిసనన్ ధరించిన దుస్తులపై కూడా అభ్యంతరాలు తెలిపాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సెన్సార్ బోర్డ్‌కు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21 కి వాయిదా వేసింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కుంది. రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారని, రావణుడిని చూపించిన విధానం సరిగా లేదని పలు విధాలుగా విమర్శలు చేశారు.












