గోదావరి నది జలాలను వినియోగించే విషయంలో కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని చనాక- కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కూడా సమాచారం అందించింది. జూలై 2021లో కేంద్రం జారీచేసిన రివర్ బోర్డుల గెజిట్‌ను అనుసరించి అనుమతులు లేని ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు పొందాల్సి ఉన్నది. అయితే… ఈ ప్రాజెక్టు ప్రారంభించే ముందు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా సంప్రదించాలని, అనుమతులన్నీ తీసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అమలుకయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాలని తెలిపింది. ప్రాజెక్టు ప్రారంభమైన ఐదేళ్ల తర్వాత పర్యావరణంపై పడే ప్రభావం మీద అధ్యయనం చేయించాలని, దాన్ని స్వతంత్ర ఏజెన్సీ చేయాలని షరతు విధించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చనాక-కొరాట ప్రాజెక్టు డీపీఆర్‌లను అదే ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జలసంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్లు ఆమోదం తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. న్గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెన్‌గంగపై గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో సమగ్రమైన ఒప్పందం చేసుకున్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాక-కొరాట బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. చనాక-కొరాట బరాజ్ నిర్మాణానికి 368 కోట్లు, లోయర్‌పెన్‌గంగ పనులకు 1,227 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూ రు చేశారు.