కరీంనగర్ లో 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని వివరించారు. లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విధానంతో దళారీ వ్యవస్థను అరికట్టగలిగామన్నారు. పది రోజుల్లో 6.09 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని, హుండీ ద్వారా 39.4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కల్పించవచ్చన్నారు.