ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. షెడ్యూల్ విడుదల

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం రెండు విడతల్లో 66 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.66 రోజుల వ్యవధిలో మొత్తం 27 పని దినాలలో సమావేశాలు కొనసాగుతాయి. కాగా ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.

Related Posts

Latest News Updates