‘మమ్మల్ని భారత్ లో కలిపేయండి’… పీఓకేలో భారీ ఉద్యమాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. తాము భారతదేశంలో కలుస్తామంటూ భారీ ర్యాలీలు తీస్తున్నారు. పాక్ ప్రభుత్వం వెంటనే తమ ప్రాంతాలను భారత్ లో కలిపేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. తమ ప్రాంత సంపదను పాక్ ప్రభుత్వం దోపిడీ చేసి, పంజాబ్, సింధ్ ప్రాంతాలకు పెట్టేస్తోందంటూ పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాక్ పీకల్లోతు కష్టాల్లో వుంది. గోధుమ పిండి కోసం అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి తన్నుకుంటున్నారు. తమది అణ్వస్త్రాలున్న దేశమని ప్రకటించిన పాక్.. ఇప్పుడు అన్నవస్త్రాల కోసం తెగ ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో పీఓకే ప్రజలు తాము భారత్ లో కలుస్తామని రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు.

Related Posts

Latest News Updates